లోకాన్ని చూపించకుండానే..!

 నిర్మల్‌ : కళ్లు తెరిచి కొత్త ప్రపంచంలోకి అడుగుపెడదామని 9 నెలలపాటు తల్లి కడుపులో తలదాచుకున్న ఆ పసికందు బయటకు రాకముందే కన్నుమూసింది. కన్నబిడ్డను కళ్లారా చూసి 9 నెలలు పడిన కష్టం మరిచిపోదామనుకున్న ఆ తల్లి కూడా తన ఆశ నెరవేరకుండానే తనువు చాలించింది. ఈ విషాద ఘటన మండలంలోని ప్యారమూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమా..? విధి వంచించిందో.. తెలియదుగాని ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలింది. ప్యారమూర్‌కు చెందిన మమత(21) అదేగ్రామానికి చెందిన క్యాతం సంతోష్‌ను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. మమత గర్భం దాల్చినప్పటినుంచి ప్రతినెలా నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఓప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటోంది.